రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ కుమురం భీం జిల్లాకు చేరుకున్న రైతు జాతా బస్సు యాత్రకు సీఐటీయూ నాయకులు స్వాగతం పలికారు. నూతన చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని నాయకులు కోరారు. రైతులు న్యాయబద్ధంగా పోరాటం చేస్తుంటే.. ఈ పోరాటంలో మావోయిస్టులు, టెర్రరిస్టులు, పాకిస్థాన్ ఉగ్రవాదులు ఉన్నారని భాజపా దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు.
నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతు జాతా బస్సు యాత్ర - సీఐటీయూ వార్తలు
రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కుమురం భీం జిల్లాకు చేరుకున్న రైతు జాతా బస్సు యాత్రకు సీఐటీయూ నాయకులు స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని నాయకులు డిమాండ్ చేశారు.
రైతు జాతా, సీఐటీయూ, కుమురం భీం జిల్లా
సమస్యల పరిష్కారానికి భాజపా చొరవ చూపించకుండా.. చర్చల పేరిట కాలయాపన చేస్తోందని నాయకులు ఆరోపించారు. రైతులను తమ వైపుకు తిప్పుకునేలా ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.
ఇదీ చదవండి:'సీఎం కేసీఆర్కు నాగార్జున సాగర్ భయం పట్టుకుంది'