కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ వ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి భీకరమైన గాలులు మెరుపులతో వర్షం కురిసింది. నియోజకవర్గంలోని కాగజ్‌నగర్, సిర్పూర్ టి మండలాల్లో గాలివాన ధాటికి పలువురి ఇళ్ల పైకప్పులు లేచిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవటం వల్ల కరెంటు నిలిచిపోయింది.
గాలివాన బీభత్సం... గ్రామాల్లో తీవ్ర నష్టం - heavy rain in kumuram bheem district
ఈదురు గాలులు, మెరుపులతో కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకర్గ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలి తీవ్ర నష్టం మిగిల్చాయి.
గాలివాన బీభత్సం... గ్రామాల్లో తీవ్ర నష్టం
వృక్షాలు నేల కూలాయి. కాగజ్‌నగర్ మండలం నజృల్‌నగర్ పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో పెనుగాలులకు ఇళ్లు ధ్వంసమై తీవ్ర నష్టం వాటిల్లింది. ఇస్గాం సమీపంలో రహదారి వద్ద పెద్ద వృక్షం నెలకూలగా... వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిర్పూర్ టి మండలంలో భారీ గాలులకు బస్టాండ్ ప్రాంతంలో రేకులు ఎగిరిపోయాయి. రహదారులపై విరిగిపడ్డ చెట్లను తొలగించించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
ఇవీ చూడండి: క్లినికల్ ట్రయల్స్‌కు 'సన్‌ఫార్మా'కు అనుమతి
TAGGED:
heavy loss