సికింద్రాబాద్ నుంచి దర్బంగా వైపు వెళ్తున్న రైలులో నుంచి ప్రమాదవశాత్తు ఇద్దరు జారిపడి మృతి చెందిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ కాగజ్నగర్ సమీపంలో చోటుచేసుకుంది. రాలపేట, కాగజ్ నగర్ రైల్వే స్టేషన్ల మధ్యలో గల 207 కిలోమీటర్ రాయి వద్ద రైలు బోగి ద్వారం వద్ద కూర్చున్న బాలుడు ప్రమాదవశాత్తు అదుపుతప్పి జారిపోయాడు. ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో మరో వ్యక్తి జారిపడ్డాడు. ఇద్దరూ మృతి చెందారు. బాలుడు ఈర్ఖండ్ రాష్ట్రం రాంచీకి చెందిన ధర్మేంద్ర ఉరవన్గా పోలీసులు గుర్తించారు. మృతి చెందిన మరో వ్యక్తి వివరాలు తెలియలేదని మృతుడి వయసు 55 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతి - pramadam
వేగంగా వెళ్తున్న రైలు నుంచి ఇద్దరు ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందిన ఘటన కుమురంభీం జిల్లాలోని కాగజ్నగర్ సమీపంలో జరిగింది.
రైలు నుంచి జారిపడి ఇద్దరు మృతి