తెలంగాణ

telangana

ETV Bharat / state

రేషన్ కష్టాలు.. ఆధార్‌ కేంద్రాలకు క్యూ - telangana news

ఓటీపీ ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలనే నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డుకు చారవాణి సంఖ్య అనుసంధానం చేసుకోవడానికి గంటల కొద్ది క్యూలో వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లాలో ఆధార్‌ కేంద్రాల వద్ద ఉదయం నుంచే జనాలు బారులు తీరిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.

queue for Aadhaar centers with the new policy of ration at komaram bheem district
రేషన్ సరుకుల నూతన విధానంతో ఆధార్‌ కేంద్రాలకు ప్రజల క్యూ

By

Published : Feb 4, 2021, 4:57 PM IST

ఓటీపీ విధానంలో రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించడం కార్డుదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. రేషన్ తీసుకోవాలంటే ఆధార్ కార్డుకు చరవాణి సంఖ్య అనుసంధానం చేయడం తప్పనిసరి అనటంతో ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు.

కుమురం భీం అసిఫాబాద్‌ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో రేషన్ కార్డు లబ్ధిదారులు కొత్త విధానంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆధార్ కార్డుకు చరవాణి సంఖ్య అనుసంధానం చేసుకోవడానికి ఉదయాన్నే కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. కాగజ్​నగర్ పట్టణంలో మూడే ఆధార్ కేంద్రాలు ఉండటం, లబ్ధిదారులు వేల సంఖ్యలో ఉండటంతో రద్దీ పెరిగిపోతుంది.

ఉదయమే వచ్చినప్పటికీ తమకు అవకాశం రావడం లేదని పలువురు వాపోతున్నారు. రేషన్ దుకాణాల వద్ద ఆధార్ కార్డుకు చరవాణి సంఖ్య అనుసంధానించి ఉంటేనే సరుకులు ఇస్తుండటంతో.. వందల సంఖ్యలో ప్రజలు ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు.

ఇదీ చూడండి:అక్కకు అసభ్య సందేశాలు.. చివరికి కటకటాలు

ABOUT THE AUTHOR

...view details