తెరాస ఎమ్మెల్యే విద్యాసాగర్ వాఖ్యలను ఖండిస్తూ కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో భాజపా నాయకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. కాగజ్ నగర్ పట్టణం రాజీవ్ గాంధీ కూడలిలో బైఠాయించి రాస్తారోకో చేశారు.
ఎమ్మెల్యే విద్యాసాగర్‌పై చర్యలు తీసుకోవాలి: భాజపా - తెలంగాణ వార్తలు
ఎమ్మెల్యే విద్యాసాగర్ వాఖ్యలను ఖండిస్తూ భాజపా నేతలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హిందు సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాడ్ చేశారు.
'ఎమ్మెల్యే విద్యాసాగర్ వెంటనే క్షమాపణలు చెప్పాలి'
రామ మందిర నిర్మాణానికి చందాలు ఇవ్వరాదని అన్నందుకు ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యాసాగర్ మాటలు హిందు సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి:పద్దులో మధ్యతరగతి వర్గం కోరుతున్నదేమిటి?