ప్రధాని నరేంద్రమోదీ 70వ జన్మదినాన్ని పురస్కరించుకుని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలో భాజపా నాయకులు సేవా సప్తాహం కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్ల పంపిణి చేపట్టారు. నేటితరం నాయకులలో ప్రధాని మోదీ ఆదర్శప్రాయుడిగా నిలుస్తున్నారని భాజపా నేత కొత్తపల్లి శ్రీనివాస్ కొనియాడారు.
మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహం - ఘనంగా ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు
కాగజ్నగర్ పట్టణంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.
మోదీ జన్మదినం సందర్భంగా సేవా సప్తాహం
నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, రెండు సార్లు ప్రధానమంత్రిగా కొనసాగుతూ మార్గదర్శకంగా నిలుస్తున్నారని అన్నారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందన్నారు. మోదీ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జీఎస్టీ చెల్లింపుల కోసం పార్లమెంట్ ఎదుట తెరాస ఎంపీల ధర్నా