తెలంగాణ

telangana

ETV Bharat / state

దారిలేక వాగు దాటేందుకు 2 గంటలు నరకయాతన పడ్డ గర్భిణి - ఆసిఫాబాద్ ఆదివాసీ గ్రామాల్లో రోడ్లు కొరత

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆదివాసీ గ్రామాలకు శతాబ్దాలు గడిచినా.. వాళ్ల తరాలు మారిన తలరాతలు మారడం లేదు. 'ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని' అన్న కవి మాటలకు ఆశపడిన ఆదివాసీలకు వారి కష్టాలు అందని ద్రాక్షలాగే మిగిలిపోతున్నాయి. జిల్లాలోని కిషన్​నాయక్ తండాకు చెందిన ఓ గర్భిణీ స్త్రీ, పురిటి నొప్పులతో వాగు దాటేందుకు దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించింది.

no proper roads to tribal villages at asifabad district
సరైన దారిలేక వాగు దాటేందుకు గర్భిణీ రెండు గంటలు నరకయాతన

By

Published : Sep 23, 2020, 4:17 PM IST

కుమురంభీం ఆసిఫాబాద్​ జిల్లా జైనూర్​ మండలంలోని చింతకర్రవాగు.. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు ఉప్పొంగి ప్రవహిస్తుండగా పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కిషన్​నాయక్ తండాకు చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో వాగు దాటేందుకు దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించింది. వాగు ఇరువైపులా దాదాపు మూడు కి.మీ నడిచి.. గ్రామస్థుల సాయంతో రెండు గంటల తర్వాత వాగు దాటింది. ప్రస్తుతం జైనూర్​ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

సరైన దారిలేక వాగు దాటేందుకు గర్భిణీ రెండు గంటలు నరకయాతన

దశాబ్దాలు గడుస్తున్నా ఏ ప్రభుత్వాలు.. తమను పట్టించుకోవట్లేదని.. ఓట్ల కోసం మాత్రమే తమ వద్దకు వస్తున్నారంటూ గ్రామస్థులు పేర్కొన్నారు. ఇప్పటికీ తన గ్రామానికి కనీసం అంబులెన్స్​ వచ్చే పరిస్థితి కూడా లేదని.. వర్షాకాలం వస్తే పరిస్థితి మరీ దారుణంగా ఉంటోందని వాపోయారు.

వంతెన లేక వాగు ఉప్పొంగితే బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయన్నారు. గ్రామానికి వెళ్లే దారి కూడా ఇబ్బందికరంగా మారుతోందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి.. తమ గ్రామాలకు వంతెనతో పాటు రహదారి సౌకర్యం కల్పించాలని డిమాండ్​ చేశారు.

ఇదీ చదవండిఃభర్త కోసం నీళ్ల ట్యాంక్​ ఎక్కి గర్భిణీ నిరసన

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details