తెలంగాణ

telangana

ETV Bharat / state

నకిలీ విత్తనాలు, 33లక్షల నగదు స్వాధీనం - fake seeds

కుమురం భీం జిల్లాలోని సిర్పూర్​ టీ మండల వ్యవసాయ అధికారులు, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. దాడుల్లో 270 నకిలీ పత్తి విత్తనాల పాకెట్లు, 33 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ మల్లారెడ్డి తెలిపారు.

33 లక్షలు స్వాధీనం చేసుకున్నాం: ఎస్పీ

By

Published : Jun 12, 2019, 1:20 PM IST

Updated : Jun 12, 2019, 5:55 PM IST

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పోలీసులు దాడులు నిర్వహించారు. 270 నకిలీ పత్తి విత్తనాల పాకెట్లు, 33 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు ముందస్తు సమాచారంతో ఈ నెల 3న సిర్పూర్​ టీ మండల వ్యవసాయ అధికారులతో కలిసి పోలీసులు పలు ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. వీరందరికి నకిలి విత్తనాలు సరఫరా చేసిన వ్యక్తి హనుమంతురావుగా గుర్తించామని ఎస్పీ మల్లారెడ్డి అన్నారు. ఇతన్ని మహరాష్ట్రలోని బల్లార్షాలో జూన్​ 9న అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. హనుమంతరావు చింతల మానపెళ్లి మండలంలోని పోలీస్ స్టేషన్​లో రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ పేర్కొన్నారు.

నకిలీ విత్తనాలు, 33లక్షల నగదు స్వాధీనం
Last Updated : Jun 12, 2019, 5:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details