కరనా ఆపత్కాలంలో పోలీసులు సేవలందించడంతో పాటు తమవంతు సాయం చేస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గోపాల్ అనే యాచకుడిని సీఐ సుధాకర్, ఎస్సై రమేశ్ చేరదీశారు. లాక్డౌన్ వేళ యాచకుడు వారం రోజులుగా రోడ్డుపై తిరుగుతూ... ఆకలితో అలమటిస్తుండడాన్ని వారు గుర్తించారు. కడుపునిండా భోజనం పెట్టి అతడి వివరాలు సేకరించి సొంత ఊరికి పంపించారు.
పోలీసుల మానవత్వం.. అన్నం పెట్టి ఆదుకున్నారు! - తెలంగాణ వార్తలు
కరోనా విపత్కర కాలంలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి. విధులతో పాటు తమవంతు సాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడిలో ఓ యాచకుడు ఆకలితో అలమటించడాన్ని పోలీసులు గమనించారు. అతడిని చేరదీసి కడుపు నిండా అన్నం పెట్టారు. ఆపై సొంత ఊరికి చేర్చారు.

యాచకుడిని చేరదీసిన పోలీసులు, యాచకులకు పోలీసుల సాయం
యాచకుడు తన ఊరు వారణాసి అని తెలిపాడు. మహారాష్ట్రకు చెందిన ఓ కారును పోలీసులు ఆపి.. గోపాల్ను వారణాసికి తీసుకెళ్లాలని ఆదేశించారు. రోడ్డుపై తిరుగుతున్న అతడిని సొంతూరికి చేరవేశారు. సీఐ, ఎస్సై మానవత్వాన్ని పలువురు అభినందిస్తున్నారు.
ఇదీ చదవండి:టీకా వేసుకుంటే బీరు ఉచితం!