అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కుమురంభీమ్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని పోలీసుల ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు. ఏఎస్పీ వైవైఎస్. సుధీంద్ర జెండా ఊపి ఈ 2కే రన్‌ను ప్రారంభించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా 2K రన్
మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకుని కాగజ్‌నగర్ పోలీసులు 2కే రన్‌ను నిర్వహించారు. ఈ రన్లో మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.
మహిళా దినోత్సవం సందర్భంగా 2K రన్
మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి ఎస్పీఎం క్రీడా మైదానం వరకు సాగిన ఈ రన్లో పలు సంఘాల మహిళలు, విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ స్వామి, ఎస్.ఎచ్.ఓ. మోహన్, రూరల్ సీఐ నరేందర్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.