దశాబ్దాలుగా నెలకొన్న పోడు భూముల సమస్యను పరిష్కరించాలంటూ భాజపా నాయకులు గత రెండు రోజులుగా కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో నిరవధిక దీక్ష చేపట్టారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని దీక్ష విరమింపజేయలని పోలీసులు కోరినప్పటికీ.. భాజపా నాయకులు ససేమిరా అనడంతో అర్ధరాత్రి సమయంలో దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు పూనుకున్నారు. ఈనేపథ్యంలో పోలీసులకు, స్థానికులకు తోపులాట చోటుచేసుకుంది. దీక్షలో ఉన్న పాల్వాయి హరీష్ బాబును తరలించేందుకు యత్నించగా స్థానికులు పోలీస్ వాహనాలను అడ్డుకున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేపట్టిన తమపై పోలీసులు అర్ధరాత్రి సమయంలో దాష్టీకం ప్రదర్శిస్తున్నారని హరీష్ ఆరోపించారు.
దీక్షాస్థలి వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత - telangana varthalu
పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలంలో భాజపా ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక దీక్షాస్థలి వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భాజపా నాయకుడు పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన దీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు అర్ధరాత్రి చేరుకోవడంతో తోపులాటకు దారితీసింది.
దీక్షాస్థలి వద్ద అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్తత
హరీష్ బాబును రెబ్బెన మీదుగా తరలించే ప్రయత్నం చేయగా.. విషయం తెలుసుకున్న రెబ్బెన గ్రామస్థులు వాహనాలకు అడ్డు తిరగడం వల్ల హరీష్ బాబును అక్కడే వదిలేశారు. ఏదేమైనప్పటికీ దీక్షను విరమించేది లేదని.. రెబ్బెన గ్రామంలోనే దీక్షను కొనసాగిస్తానని పాల్వాయి హరీష్ బాబు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: దిగుబడి పెరిగినా కొనే నాథుడు లేక మక్క రైతుల ఆందోళన