కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ప్లాస్టిక్ నిషేదంపై ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వనజా రెడ్డి, కమిషనర్ భట్టు తిరుపతి, కాగజ్ నగర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మీ నరసింహ హాజరయ్యారు. ఈ సందర్భంగా మన నిత్యావసరాల దృష్ట్యా వాడుతున్న ప్లాస్టిక్ రాబోయే తరానికి పెను ముప్పుగా మారుతుందని అన్నారు. ప్లాస్టిక్ నిషేధం అనేది మన ఇంటి నుంచే మొదలవ్వాలని.. మనం ఆచరించినప్పుడే ఎదుటివారికి చెప్పగలమని సూచించారు.
'ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి' - కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణం
కాగజ్ నగర్ పట్టణంలోని పురపాలక సంఘం కార్యాలయంలో ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు.
!['ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4613153-741-4613153-1569938431296.jpg)
'ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి'
'ప్లాస్టిక్ నిషేధం మన ఇంటి నుంచే మొదలవ్వాలి'
Last Updated : Oct 2, 2019, 7:28 AM IST