కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన జాకీర్ పాషాకు పుట్టుకతోనే రెండు చేతులు లేవు. అయినా నిరుత్సాహపడకుండా తన పనులు తానే స్వయంగా చేసుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో ముందుంటారు. హరిత హారంలో భాగంగా కాళ్లతో మొక్కలు నాటి పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు జాకీర్.
ఈ కార్యక్రమంలో భాగంగా తన ఇంటి ముందు.. కాళ్లతోనే గొయ్యి తీసి మొక్కలు నాటి నీళ్లు పోశారు. పర్యావరణ సమతుల్యతను పరిరక్షించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని జాకీర్ చెబుతున్నారు. మానవాళి మనుగడకు ప్రకృతిని పెంపొందించడం చాలా అవసరమని పేర్కొన్నారు.