ఆసిఫాబాద్ కొమరం భీమ్ జిల్లాలో ఈరోజు సంత జరిగింది. ఈ నేపథ్యంలో కిరాణా దుకాణాలు, ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడారు. అధికారులు సైతం చూసీ చూడనట్లు వ్యవహరించారు.
దూరం పాటించని ప్రజలు, వ్యాపారస్తులు!
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు ప్రజలు సామాజిక దూరం పాటించ లేదు. వ్యాపారస్తులు కరోనా వైరస్ వ్యాప్తి గురించి మరిచిపోయారు. వైరస్ వ్యాప్తితో అనేక మరణాలు సంభవిస్తున్నా జిల్లా ప్రజలకు అవగాహన లేకపోవడం ఎంతో దురదృష్టకరం అని పలువురు అభిప్రాయపడుతున్నారు.
దూరం పాటించని ప్రజలు, వ్యాపారస్తులు!
కొవిడ్-19పై అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు భౌతిక దూరం పాటించడం లేదు. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న వేళ నిర్లక్ష్యం జిల్లా కేంద్రంలో స్పష్టంగా కనబడింది. ఇప్పటికైనా అధికారులు, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలని పలువురు కోరుతున్నారు.
ఇదీ చూడండి :మాయదారి మనిషిని నేను అంటున్న ఎస్పీ బాలు