తెలంగాణ

telangana

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానా

కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో.. అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో లాక్​డౌన్ అమలవుతోన్న తీరును పరిశీలించారు. అత్యవసర పనుల నిమిత్తం మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు.

violating the lockdown rules
violating the lockdown rules

By

Published : May 21, 2021, 12:21 PM IST

కుమురం భీం జిల్లాలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలవుతోంది. అనవసరంగా రోడ్లపైకి వచ్చేవారిని పోలీసులు కట్టడి చేస్తున్నారు. అదనపు ఎస్పీ వైవీఎస్ సుధీంద్ర.. కాగజ్ నగర్ పట్టణంలో లాక్​డౌన్ అమలవుతోన్న తీరును పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు జరిమానా విధించారు.

ఉదయం 10గంటల తరువాత అకారణంగా బయటకు వచ్చే వారి పట్ల కఠిన చర్యలు చేపడతామని సుధీంద్ర హెచ్చరించారు. షాపు యజమానులు.. వినియోగదారులను భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచనలు చేశారు. వైరస్​ కట్టడిలో అందరూ భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:హైదరాబాద్‌ నుంచి విశాఖకు కొరియర్లో ‘రెమ్‌డెసివిర్‌’!

ABOUT THE AUTHOR

...view details