కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలో పులి సంచారం కలకలం రేపింది. కొండపల్లి గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో పులి రహదారి పైకి రావడం వల్ల వాహనదారులు భయాందోళనలకు గురయ్యారు. రోడ్డు పక్కన పెద్దపులి ఉండడం వల్ల వాహనదారులు ఎక్కడికక్కడే ఉండిపోయారు. బెజ్జూర్, పెంచికలపేట మండలాలకు నిత్యం రాకపోకలు సాగించే వారు ఆ మార్గంలో పెద్దపులి సంచరిస్తోందని తెలిసినప్పటి నుంచి తీవ్ర భయాందోళనలు గురవుతున్నారు.
కుమురం భీం జిల్లాలో పెద్దపులి కలకలం - పెద్దపులి కలకలం
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట, బెజ్జూర్ మండలాల్లో పెద్దపులి సంచరిస్తోందని స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేశారు.
పెద్దపులి కలకలం