తెలంగాణ నుంచి రైళ్లలో మహారాష్ట్రకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పౌర సరఫరాల శాఖ టాస్క్ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగజ్నగర్ మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్తున్న రామగిరి, భాగ్యనగర్ ప్యాసింజర్ రైళ్లలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతోంది. ఈ సమాచారంతో ఆర్పీఎఫ్ సహకారంతో రైళ్లలో దాడులు నిర్వహించారు. రెండు రోజులల్లో 235.97 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు పౌర సరఫరాల శాఖ ఓఎస్డీ శ్రీనివాస్ తెలిపారు. పట్టుకున్న బియ్యాన్ని కాగజ్ నగర్ పట్టణంలోని గోదాంకు తరలించారు.
మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం - CIVIL SUPPLY TASKFORCE
రేషన్ బియ్యాన్ని విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాల శాఖ ఓఎస్డీ శ్రీనివాస్ హెచ్చరించారు. కుమురం భీం జిల్లా కాగజ్నగర్ నుంచి మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం
మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న బియ్యం స్వాధీనం