కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండల కేంద్రంలో తమ కూతురికి షాదీ ముబారక్ డబ్బులు రాలేదని షేక్ కులశాం, నజీమాబీ దంపతులు ఆందోళన వ్యక్తం చేశారు. తమ కూతురికి న్యాయం చేయాలని తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వేడుకున్నారు. లింగాపూర్ మండలంలోని ఎల్లాపటార్కు చెందిన ఈ దంపతులు తమ రెండో కుమార్తె నేహాబీకి గత ఏడాది వివాహం చేశారు. షాదీ ముబారక్ కోసం దరఖాస్తు చేయగా... నేహాబీ మహరాష్ట్రలో జన్మించిందని ధ్రువపత్రంలో ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే అధికారులు దరఖాస్తును తిరస్కరించారని వారు వాపోయారు.
తమ కూతురికి షాదీ ముబారక్ సొమ్ము రాలేదని తల్లిదండ్రులు ఆందోళన - kumurambheem asifabad district news
తమ కూతురికి షాదీ ముబారక్ సొమ్మురాలేదని షేక్ కులశాం, నజీమాబీ దంపతులు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి వేడుకున్నారు. తమ కూతురి ధ్రువపత్రంలో మహారాష్ట్రలో పుట్టిందని ఉండడం వల్ల క్షేత్రస్థాయిలో విచారణ చేయకుండానే అధికారులు దరఖాస్తును తిరస్కరించారని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
తమ కూతురికి షాదీ ముబారక్ సొమ్ము రాలేదని తల్లిదండ్రులు ఆందోళన
తమ కూతురికి షాదీ ముబారక్ ద్వారా వచ్చే సొమ్మును అందకుండా చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నేహాబీ తన అమ్మమ్మ గ్రామంలో పుట్టడమే తాను చేసిన పాపమా అంటూ వాపోయారు. తమ స్వస్థలం లింగాపూర్ మండలంలోని ఎల్లాపటార్ గ్రామమని వెల్లడించారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు, జిల్లా పాలనాధికారి తమ గోడును విని న్యాయం చేయాలంటూ వేడుకున్నారు.
ఇవీ చూడండి: గనిలో... ఆమెదే మొదటి అడుగు!