కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం మంగిలో ఆలీబాబా పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పంచాయతీలో మీటింగ్ ఉందని ఇంటి నుంచి బయల్దేరారు. తిరిగి ఇంటికి రాలేదు. ఈ రోజు ఉదయం వట్టి వాగులో శవంగా కనిపించాడు.
పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి - kumuram bheem asifabad district crime news
పొద్దున్నే డ్యూటీకి బయల్దేరిన పంచాయతీ కార్యదర్శి వాగులో శవంగా మారిన ఘటన కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మంగిలో జరిగింది. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి panchayathi secretary suspected death](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6405397-thumbnail-3x2-sdgs.jpg)
పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి
పంచాయతీ కార్యదర్శి అనుమానాస్పద మృతి
గజ ఇతగాళ్లతో మృతదేహాన్ని బయటకు తీయించిన పోలీసులు అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్ట్మార్టం నిమిత్తిం మృతిదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:కరోనా నుంచి పిల్లల్ని ఇలా.. రక్షించుకుందాం!