కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పదో తరగతి వారి కోసం నాలుగు కేంద్రాలు, ఇంటర్ కోసం రెండు కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల రాష్ట్ర పరిశీలకులు సహదేవుడు తనిఖీ చేశారు. ప్రశాంతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులు, సిబ్బందికి సూచించారు. పదో తరగతి విద్యార్థులు 610 మందికి 552 మంది, ఇంటర్ పరీక్షలకు రెండు కేంద్రాల్లో కలిపి 294 మందికి 253 మంది పరీక్షకు హాజరైనట్లు ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఉదయ్‌బాబు పేర్కొన్నారు.
ప్రశాంతంగా ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభం - ఆసిఫాబాద్
కుమురం భీం జిల్లాలో ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రశాంతంగా ఓపెన్ పరీక్షలు ప్రారంభం