కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలానికి చెందిన దారావత్ సుఖ్లాల్ అనే వ్యక్తి తాగిన మైకంలో ఇల్లాలితో గొడవపడి తనను తానే పొడుచుకున్నాడు. దహేగం మండలం దేవులగూడ గ్రామానికి చెందిన దారావత్ సుఖ్లాల్ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. చిన్న విషయానికి భార్య భారతితో గొడవపడ్డాడు. చిన్న గొడవ కాస్త పెద్దదవడం వల్ల మత్తులో ఉన్న సుఖ్లాల్ కత్తితో తనను తానే పొడుచుకున్నాడు.
తాగిన మైకంలో తనను తానే పొడుచుకున్న వ్యక్తి - one person suicide attempt in kumurambheem asifabad district
తాగిన మైకంలో భార్యతో గొడవపడి తనను తానే ఓ వ్యక్తి పొడుచుకున్నాడు. ఈ ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా దేవులగూడ గ్రామంలో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాగిన మైకంలో తనను తానే పొడుచుకున్న వ్యక్తి
ఛాతిపైన, తొడపైన పొడుచుకోవడం వల్ల అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన బంధువులు అతన్ని కాగజ్నగర్ పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: లాక్డౌన్లో పెరిగిన గృహ హింస ఫిర్యాదులు
TAGGED:
crime news