తెలంగాణ

telangana

ETV Bharat / state

వన భోజనంలో విషాదం..ఒకరు మృతి - One person murder in Kurambhim District

కొమురం భీం జిల్లా మదర్ మోడీ గ్రామంలో వనభోజనాల కార్యక్రమం కాస్త ఉద్రికత్తలకు దారితీసింది. సోయం జంగు అనే వ్యక్తి అతిగా మద్యం సేవించి ఇద్దరు వ్యక్తులతో గొడవపడటం వల్ల వారు అతని కర్రతో కొట్టి చంపేశారు.

వన భోజనంలో విషాదం..ఒకరు మృతి

By

Published : Jul 11, 2019, 5:28 PM IST

కొమురం భీం జిల్లా మదర్ మోడీ గ్రామంలో బుధవారం వనదేవతకు పూజా కార్యక్రమాలు నిర్వహించి..వనభోజనాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో సోయం జంగు అతిగా మద్యం సేవించి కుర్సంగా సురేష్, ఆత్రం బాపులతో వాగ్వాదానికి దిగాడు. తీవ్ర ఆగ్రహానికి లోనైన ఇద్దరు సోయం జంగుపై కర్రతో తలపై బలంగా కొట్టారు. దెబ్బ బలంగా తగలడం వల్ల జంగు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుని కొడుకు సోయం బొజ్జరావు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

వన భోజనంలో విషాదం..ఒకరు మృతి

ABOUT THE AUTHOR

...view details