తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో మరో పాజిటివ్​కేసు.. - రెడ్​జోన్లు

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. రెడ్​జోన్​గా ప్రకటించిన జైనూర్​లో ఈ కేసు నమోదవడం వల్ల జిల్లాలో మొత్తం వైరస్​ కేసుల సంఖ్య నాలుగుకు చేరింది.

one-more-corona-positive-case-registered-in-kumurambheem-asifabad
ఆసిఫాబాద్​లో మరో పాజిటివ్​కేసు..

By

Published : Apr 17, 2020, 10:10 AM IST

దిల్లీ మర్కజ్​కు వెళ్లి వచ్చిన వారి నుంచి మరొకరికి కరోనా వైరస్ వ్యాపించింది. జిల్లాలోని జైనూరు మండల కేంద్రానికి చెందిన ముగ్గురు దిల్లీ వెళ్లి రాగా వారిలో ఒకరికి కరోనా సోకింది. అతని ఇద్దరు కుమారులకు వ్యాధి సోకినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ కుటుంబంతో సన్నిహితంగా ఉన్న మరో 13 మందిని ఆసిఫాబాద్ ఐసోలేషన్ వార్డుకు తరలించి, వారి నమూనాలను గాంధీ ఆసుపత్రికి పంపారు.

అందులో ఒకరికి కరోనా సోకినట్లుగా గురువారం రాత్రి నివేదిక వచ్చింది. అప్రమత్తమైన అధికారులు ప్రత్యేక వాహనం సమకూర్చి పాజిటివ్ వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ గాంధీకి తరలించారు. రెడ్​జోన్​గా ప్రకటించిన జైనూర్​లో మరో కేసు నమోదు కావడం వల్ల మొత్తంగా పాజిటివ్ వ్యక్తుల సంఖ్య 4కు చేరుకుంది.

ఆసిఫాబాద్​లో మరో పాజిటివ్​కేసు..

ఇదీ చూడండి:సడలింపులపై రాష్ట్ర ప్రభుత్వం విముఖత!

ABOUT THE AUTHOR

...view details