తెలంగాణ

telangana

ETV Bharat / state

బారేగూడ సర్పంచ్​పై విచారణ - సర్పంచ్​పై విచారణ

నిబంధనలకు విరుద్ధంగా పోటీ చేసి ఎన్నికయ్యారంటూ కాగజ్​​నగర్​ బారేగూడ సర్పంచ్​ విమలపై అందిన ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అనంతరం నివేదికను కలెక్టర్​కు అందిస్తామని వారు తెలిపారు.

సర్పంచ్​పై​ విచారణ

By

Published : Mar 15, 2019, 3:32 PM IST

విచారణ జరుపుతున్న అధికారులు
కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం బారేగుడా సర్పంచ్ గుర్లే విమల ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. ఎన్నికల అధికారులకు తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సమర్పించారని స్థానిక నాయకులు ఆరోపించారు.

నిబంధనలకు విరుద్ధం

ఈసీ నిబంధనల ప్రకారం 1995 తర్వాత ముగ్గురు సంతానం ఉంటే వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని ఫిర్యాదుదారుడు వేణుగోపాల్​ పేర్కొన్నారు. ఎన్నికలు జరిగిన రోజు అధికారులకు చెబితే స్పందించలేదని అందువల్లే కలెక్టర్​కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

అంతా సవ్యం

తనకు మూడో సంతానం 1995 నాలుగో నెలలో జన్మించాడని సర్పంచ్ విమల చెబుతోంది. గతంలోనూ తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. విచారణ అంతా సవ్యంగానే ఉంటుందని పేర్కొన్నారు.

ఇవీ చూడండి :సీఎల్పీ విలీనమే లక్ష్యంగా తెరాస అడుగులు!

ABOUT THE AUTHOR

...view details