తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా వేళ అధికారులు, పురపాలక సిబ్బంది సేవలు భేష్ - తెలంగాణ వార్తలు

కరోనా వేళ అధికారులు, పురపాలక సిబ్బంది, ప్రజాప్రతినిధులు నిరంతరం సేవ చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తూ అవసరమైన వారికి చేయూతనందిస్తున్నారు. కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలికలోని వివిధ విభాగాల ఉద్యో గులు, సిబ్బంది సేవలను పట్టణ ప్రజలు కొనియాడుతున్నారు.

kagaznagar, komarambheem asifabad
అధికారుల సేవలు, కరోనా వేళ అధికారుల పర్యవేక్షణ

By

Published : Jun 9, 2021, 9:48 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మరి కట్టడికి అధికారులు, పురపాలక సిబ్బంది, ప్రజాప్రతినిధులు అలుపెరుగని కృషి చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పటిష్ఠంగా అమలు చేస్తూ అవసరమైన వారికి చేయూతనందిస్తున్నారు. మహమ్మారి బారిన పడి అసువులు బాసిన వారికి అంత్యక్రియలు నిర్వహిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. వైరస్ వ్యాప్తి నియంత్రణలో నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పురపాలికలోని వివిధ విభాగాల ఉద్యో గులు, సిబ్బంది సేవలను పట్టణ ప్రజలు కొనియాడుతున్నారు.

పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కాగజ్ నగర్ పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, కమిషనర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరంతరం శ్రమిస్తున్నారు. ప్రధాన రహదారులు, కూరగాయల మార్కెట్, పట్టణంలోని చౌరస్తాల్లో నిరంతరం పారిశుద్ధ్య పనులను చేపడుతున్నారు. క్వారంటైన్ కేంద్రాలు, ఐసోలేషన్ కేంద్రాలను కమిషనర్ శ్రీనివాస్, ఇంఛార్జి శానిటరీ ఇన్​స్పెక్టర్ బి. శ్రీనివాస్ సందర్శిస్తున్నారు. వైద్య సేవలపై ఆరా తీస్తున్నారు. ఇంటింటా ఆరోగ్య సర్వే చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, వసతి గృహాలు, ప్రయాణ ప్రాంగణం, రైల్వే స్టేషన్ ఏరియాల్లోనూ నిత్యం శానిటైజ్ చేయిస్తున్నారు. 30 వార్డులో ప్రతి వార్డుకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఆపత్కాలంలో వారి సేవలు వెలకట్టలేనివి.

ఇదీ చదవండి;Sushil Kumar: 'మిల్క్​షేక్​, వ్యాయామ పరికరాలు కావాలి!​'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details