కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో ఉదయం 10 గంటల వరకు విపరీతమైన రద్దీ నెలకొంది. ఆదివారం కావడం వల్ల జనాలు పెద్ద ఎత్తున మాంసం కోసం మార్కెట్‌కు ఎగబడ్డారు. మార్కెట్ నిర్వహణ సమయం తక్కువగా ఉన్నప్పటికీ... మండలంలోని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో సంతకు తరలివచ్చారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించినప్పటికీ... ఏ ఒక్కరు కూడా మాస్కు, భౌతిక దూరం పాటించకుండానే తమకు కావాల్సిన నిత్యావసర సరుకుల కొనుగోలు చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు తుంగలో తొక్కి మార్కెట్‌కు ఎగబడ్డ జనాలు.. - కాగజ్‌నగర్‌లో మాంసం మార్కెట్లకు ఎగబడ్డ జనాలు
ఓ వైపు ఆదివారం.. మరోవైపు లాక్డౌన్.. ఏం కావాలన్నా 10 గంటలలోపే కొనుక్కోవాలనే ఉద్దేశంతో కాగజ్ నగర్ ప్రజలు ఆదివారం సంతకు ఎగబడ్డారు. కరోనా నిబంధనలను తుంగలో తొక్కి మాంసం, నిత్యావసర సరుకులు కొనుగోలు చేశారు.
రద్దీగా మారిన కాగజ్‌నగర్ మార్కెట్
రాజీవ్ గాంధీ కూడలి, అంబేడ్కర్ కూడలి, పొట్టి శ్రీరాములు కూడలిలో వాహనాల రద్దీ ఎక్కువైంది. జనాలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నందున పోలీసులు రంగంలోకి దిగి వాహనాల రద్దీని నియంత్రించారు. 10 గంటల తరువాత ఎవరూ బయట తిరగరాదని, నిబంధనలు ఉల్లంగిస్తే వాహనాలు జప్తు చేస్తామని హెచ్చరించారు.
ఇదీచదవండి :మాంసం దుకాణాల వద్ద బారులుతీరిన జనం.. కనిపించని భౌతికదూరం