తెలంగాణ

telangana

ETV Bharat / state

దిశ తరహా ఘటన.. న్యాయం జరగట్లేదని ఆరోపణ - police

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వివాహిత అత్యాచారం, ఆపై దారుణ హత్య ఘటన కేసు.. నిందితులను అదుపులోకి తీసుకోవడానికే పరిమితమైంది.  హైదరాబాద్‌లో జరిగిన దిశ అత్యాచారం కంటే మూడురోజుల ముందే... ఈ దారుణం చోటుచేసుకున్నా... పోలీసు దర్యాప్తులో సరైన పురోగతి కనిపించడం లేదనే ఆందోళన వ్యక్తమవుతోంది.

no justice in lady murder in adilabad
5294251

By

Published : Dec 7, 2019, 5:02 AM IST

Updated : Dec 7, 2019, 5:18 AM IST

కుమురంభీం జిల్లాలో దిశ తరహా ఘటన... న్యాయం జరగట్లేదని ఆరోపణ

కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా లింగాపూర్‌ మండలం రాంనాయక్‌ తండా-ఎల్లపటార్‌ మార్గ మధ్యలో నవంబర్‌ 24న వివాహిత టేకు లక్ష్మిని... ముగ్గురు వ్యక్తులు హత్యాచారం చేసిన ఘటన తీవ్ర కలకలం రేకెత్తించింది. ఎల్లాపటార్‌ గ్రామంలో గాలి బుగ్గలు, స్టీలు గిన్నెలు, మహిళల అలంకరణ సామగ్రిని విక్రయించి... రాంనాయక్‌ తండాకు తిరిగి వస్తుండగా ఈ దారుణం జరిగింది. ఎల్లాపటార్‌కు చెందిన ముఖ్ధుం, షాబొద్దీన్‌, షేక్‌ బాబు ఆమె వెంటపడమే కాకుండా... లక్ష్మిని బలవంతంగా చెట్లపొదల్లోకి లాక్కెళ్లి... అత్యాచారం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇస్తుందనే భయంతో... ఆమె తలపై బండరాళ్లతో కొట్టి... గొంతును కత్తితో కోసి దారుణంగా హత్యచేశారు.

భార్య ఆచూకీ తెలియక...

నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలం గోసాయిపేటకు చెందిన టేకు లక్ష్మి-గోపి దంపతులు. తమ ఇద్దరు పిల్లలతో కలిసి ఐదేళ్ల కిందట బతుకుదెరువు కోసం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్​కు వలస వచ్చింది. మహిళల అలంకరణ వస్తువులు, స్టీలు గిన్నెలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. ఇందులో భాగంగానే... నవంబర్‌ 24న జైనూర్‌ నుంచి దంపతులిద్దరూ ద్విచక్రవాహనంపై బయలు దేరారు. భార్య లక్ష్మిని లింగాపూర్‌లో దించేసి భర్త గోపి... మరో ఊరువెళ్లాడు. మధ్యాహ్నం వేళ తిరిగి వచ్చిన గోపికి భార్య లక్ష్మి ఆచూకీ లభించలేదు. ఫోన్ స్విఛ్‌ఆఫ్‌ రావడం వల్ల లింగాపూర్‌ వెళ్లాడు. రాత్రివరకూ ఆమె ఆచూకీ తెలియక... లింగాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

లక్ష్మి ఘటనలో ఎందుకిలా?

రాత్రంతా పడిగాపులు కాసిన గోపి కుటుంబానికి.... నవంబర్‌ 25న రాంనాయక్‌తండా-ఎల్లాపటార్ మార్గంలో చెట్లపొదల మధ్య లక్ష్మి మృతదేహం ఉందని తెలిసింది. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని... ఆసిఫాబాద్‌ జైలుకు తరలించారు. దిశ హత్యపై స్పందించినట్లు పోలీసులు లక్ష్మి ఘటనపై ఎందుకింత నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణ వినబడుతోంది.

ఇంకా లోకంపోకడ తెలియని సిద్ధార్థ, నరేందర్ తల్లిలేని అనాథలుగా మారడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది. దిశ ఘటన తరువాత ఈ కేసు పోలీసులకు సవాలుగా మారింది.

ఇవీ చూడండి: మృతదేహాలు 9వ తేదీ వరకు భద్రపరచండి: హైకోర్టు ఆదేశం

Last Updated : Dec 7, 2019, 5:18 AM IST

ABOUT THE AUTHOR

...view details