కుమురం భీం జలాశయం నిర్మాణంలో భాగంగా ముంపునకు గురైన గ్రామస్థుల కోసం 11 కాలనీలు ఏర్పాటు చేశారు. అడా ప్రాజెక్టు నిర్వాసితుల కోసం 2008లో ఆసిఫాబాద్ శివారులో సర్వే నంబరు 249లో గల ప్రభుత్వ స్థలంలో 324 ప్లాట్లు పంపిణీ చేయగా... మరో 56 ప్లాట్లు ఖాళీగా ఉన్నాయి. మరికొందరికి జానకపూర్ సమీపంలోని భాగ్యనగర్ వద్ద పునరావాసం కల్పించారు. నూతన జిల్లాగా ఏర్పడిన ఆసిఫాబాద్ కలెక్టర్ కార్యాలయం వెనకే ఈ కాలనీ ఉండటం, అంతర్రాష్ట్ర రహదారికి సమీపంలో ఉండటం వలన అక్రమార్కులు రంగంలోకి దిగారు.
అక్రమార్కుల చేతివాటం
జిల్లా కేంద్రంలో కబ్జాల దందా చేస్తున్న ముఠాకు ఖాళీ ప్లాట్లను అంటగడుతూ అధికారులు అందినకాడికి దండుకుంటున్నారు. ఐదువందల ప్లాట్లలో కేవలం 70 కుటుంబాలు మాత్రమే ఉన్నాయి. చాలామంది అనేక కారణాలతో గృహాలను నిర్మించుకోలేదు. ఖాళీ స్థలాలతోపాటు నిర్వాసితులు వదిలేసిన వాటిని కూడా అధిక ధరకు విక్రయిస్తున్నారు. గ్రామపంచాయతీ అనుమతితో నిర్మాణాలు వేగంగా పూర్తి చేస్తుండటంతో అసలైన లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 11 పునరావాస గ్రామాల్లోనూ ఇదే దుస్థితి నెలకొందని, అధికారుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఆలయాల ప్లాట్లూ స్వాహా