కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా సందీప్ కుమార్ ఝా సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్గా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై ఆసిఫాబాద్ జిల్లా నూతన పాలనాధికారిగా వచ్చారు.
ఇక్కడి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వరంగల్ నగరం కలెక్టర్గా బదిలీ అయ్యారు. జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి.. అభివృద్ధికి కృషి చేస్తానని సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. సమన్వయంతో పనిచేస్తూ జిల్లా ప్రగతికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.