తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మవారి అవతారాల్లో చిన్నారులు.. కాగజ్​నగర్​లో నవరాత్రి ఉత్సవాలు - కాగజ్​నగర్​ కన్యకాపరమేశ్వరీ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు తాజా వార్త

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలో దేవి శరన్నవరాత్రులు వైభవోపేతంగా జరుగుతున్నాయి. నవరాత్రులను పురస్కరించుకుని పట్టణంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఎనిమిదో రోజున అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది.

navratri-celebrations-kanyaka-parameswari-temple-at-kagaznagar-in-kumura-bheem-district
అమ్మవారి అవతారాల్లో చిన్నారులు.. కాగజ్​నగర్​లో నవరాత్రి ఉత్సవాలు

By

Published : Oct 24, 2020, 10:06 PM IST

కుమురంభీం జిల్లా కాగజ్​నగర్ పట్టణంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో కన్యకాపరమేశ్వరి దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. శరన్నవరాత్రుల్లో భాగంగా రోజూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ పూజలు చేస్తున్నారు. వేడుకలను పురస్కరించుకుని ఆలయ అధికారులు ఎనిమిదోరోజున చిన్నారుల చేత అమ్మవారి తొమ్మిది అవతారాలను వేయించారు.

బాలాత్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణ దేవి, వాసవి కన్యకాపరమేశ్వరి దేవి, లలితా దేవి, సరస్వతి దేవి, శ్రీమహాలక్ష్మీ దేవి, దుర్గా దేవి, మహిషాసురమర్దిని అవతారాల్లో చిన్నారులు భక్తులకు దర్శనమివ్వగా.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కాగా అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తుల పూజలందుకుంది.

ఇదీ చదవండి:వర్గల్​ సరస్వతి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details