కుమురం భీం ఆసిఫాబాద్ మండలం మోవాడ్ గ్రామానికి చెందిన మడావి నేతుబాయిని నెలన్నర కిందట ఇంటి ఆవరణలో పాము కాటేసింది. ఆమెను తిర్యాణి మండలంలోని గంగాపూర్ గ్రామంలో ఉంటున్న తన మేనమామ సిడాం జంగు ఇంటికి తీసుకెళ్లి.. చిన్న గుడిసె వేసి అందులో ఉంచారు. పసరు మందు పూశారు. చెట్ల మందు మాత్రమే తాగించారు. దాదాపు 50 రోజులైనా సమస్య తీరక పోవడం వల్ల సిడాం జంగు నేతుబాయిని మండల కేంద్రంలోని ఓ ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. సమస్య తీవ్రతను గుర్తించిన వైద్యుడు విషయాన్ని తిర్యాణి ఎస్సై రామారావుకు తెలిపారు.
పసరు మందుతో అసలుకే ఎసరు! - latest news on Naturopathy for snake bite is in vain .. Finally ..?
పాటు కాటుకు గురైన ఓ మహిళ నాటువైద్యాన్ని ఆశ్రయించింది. అది ఫలించక కాలు మొత్తం విషపూరితమై నెలన్నరగా నరకం అనుభవిస్తుంది. విషయం తెలుసుకున్న ఓ పోలీస్ అధికారి బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అసలేం జరిగిందంటే..
పాముకాటుకు నాటువైద్యం ఫలించలేదు.. చివరికి..?
వెంటనే స్పందించిన ఎస్సై సిడాం జంగు ఇంటిని చేరుకుని బాధితురాలి విషమ పరిస్థితిని గమనించారు. వారి కుటుంబ సభ్యులను ఒప్పించి వైద్యం కోసం తిర్యాణి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్ మహాత్మాగాంధీ (ఎంజీఎం) ఆస్పత్రికి తరలించారు.
TAGGED:
పసరు మందుతో అసలుకే ఎసరు!