తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రారంభమైన జాతీయ స్థాయి ఖోఖో పోటీలు

నవోదయ పాఠశాలల 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో ఎనిమిది రీజియన్ల నుంచి 48 జట్లు, 650 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలు

By

Published : Aug 9, 2019, 8:02 PM IST

కుమురం భీం జిల్లా కాగజ్​నగర్​లోని జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ పాఠశాలల 30వ జాతీయ స్థాయి ఖోఖో పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ ఉమామహేశ్వర రావు హాజరయ్యారు. క్రీడాకారులు జ్యోతి వెలిగించి ఆటలను ప్రారంభించారు. నవోదయ విద్యార్థుల గుస్సాడీ నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ క్రీడల్లో దేశవ్యాప్తంగా ఎనిమిది రీజియన్ల పరిధిలోని భోపాల్, చంఢీగఢ్, హైదరాబాద్, జైపూర్, పూణే, షిల్లాంగ్, లఖ్​నవూ, పట్నాల విద్యార్థులు పాల్గొంటున్నారు. అండర్- 14, అండర్-17, అండర్- 19 విభాగాల్లో ఎనిమిది రీజియన్ల నుంచి 48 జట్లు.. 650 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.

జాతీయ స్థాయి ఖోఖో పోటీలు

ABOUT THE AUTHOR

...view details