నాయి బ్రాహ్మణ కులవృత్తుల్లోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశాన్ని నిరసిస్తూ కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కార్పొరేట్ సంస్థల రాక వల్ల తమ జీవనోపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో పెద్ద షాపు ప్రారంభించి నాయి బ్రాహ్మణుల పొట్టకొడుతున్నారని ఆరోపించారు.
'కార్పొరేట్ కటింగ్ షాపులతో కులవృత్తి కుదేలు' - telangana varthalu
కాగజ్నగర్ పట్టణంలో నాయి బ్రాహ్మణులు నిరసన ర్యాలీ చేపట్టారు. కులవృత్తుల్లోకి కార్పొరేట్ సంస్థలు చేరడం వల్ల తమ జీవనోపాధిని కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
కులవృత్తుల్లోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశాన్ని నిరసిస్తూ ఆందోళన
అందుకు నిరసనగా కాగజ్ నగర్ పట్టణంలో ఒకరోజు సెలూన్ దుకాణాలు బంద్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కారం చూపాలని కోరారు.
ఇదీ చదవండి: 'దాడులు ఆపాలి.. సాగుదారులకు హక్కులు కల్పించాలి'