కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ భేటీలో పాలకవర్గం 12 అంశాలను చర్చించి ఆమోదించింది. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పట్టణంలో నెలకొన్న సమస్యలను లేవనెత్తారు. గతవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను అధికారులు కౌన్సిలర్లను సంప్రదించకుండానే తయారు చేశారని ఆరోపించారు.
'కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించండి' - kagaznagar news
కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలకవర్గం 12 అంశాలను చర్చించి ఆమోదించింది.
!['కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలు పరిష్కరించండి' Municipal meeting](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11300539-548-11300539-1617702493286.jpg)
కాగజ్‌నగర్ పురపాలక సంఘం
డిప్యుటేషన్‌పై ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారి వద్ద సరైన సమాచారం ఉండటం లేదని కౌన్సిలర్లు అన్నారు. వార్డుల్లో పైప్‌లైన్ లీకేజీ అవుతుందంటూ సిబ్బందికి ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. కౌన్సిలర్లు లేవనెత్తిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఛైర్మన్ సద్దాం హుస్సేన్... కమిషనర్‌ను, అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:ట్రాక్టర్ డ్రైవర్ హత్య.. వివాహేతర సంబంధమేనా!