కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో వైస్ ఛైర్మన్ గిరీశ్ కుమార్, పురపాలక కమిషనర్ తిరుపతి, వార్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
కాగజ్‌నగర్‌లో వాడివేడిగా సాగిన పాలకవర్గ సమావేశం - latest news on muncipal council meeting at kagaznagar in asifabad district
కాగజ్‌నగర్ పురపాలక సంఘంలో నిర్వహించిన పాలకవర్గ సమావేశం వాడివేడిగా సాగింది. వార్డుల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు లేవనెత్తగా.. సమావేశం గందరగోళంగా మారింది.
పట్టణ ప్రగతి పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్తర కార్యక్రమం పట్టణంలో సరిగా అమలు కావడం లేదని సభ్యులు ఆరోపించారు. ప్రారంభమైన మొదటి రోజు తర్వాత ఏ ఒక్క ప్రజాప్రతినిధి కాలనీల్లోకి రావడం లేదని ఆరోపించారు. ఎన్నికలు ముగిశాక పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైందని సభ్యులు ఆరోపించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. చెత్త సేకరణ కోసం 7 ఆటోలు, 2 ట్రాక్టర్లు ఉన్నప్పటికీ వాటిని వినియోగించడం లేదని ఆరోపించారు. మొదటి సారిగా ఏర్పాటు చేసిన సమావేశంలో వార్డుల్లో నెలకొన్న సమస్యలను సభ్యులు లేవనెత్తడం వల్ల సమావేశం గందరగోళంగా మారింది.
ఇవీ చూడండి:నాకు గర్వకారణంగా ఉంది: కేటీఆర్