ఒకే దేశం ఒకే జెండా నినాదంతో పోరాటం చేసిన గొప్ప నాయకుడు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కొనియాడారు . డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 67వ వర్ధంతిని పురస్కరించుకుని కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం రాజీవ్ నగర్లో మొక్కలు నాటారు. కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో పోరాడరని అన్నారు. భాజపా ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరినట్లు అయిందని పేర్కొన్నారు.
ఆర్టికల్ 370 రద్దుతో ముఖర్జీ ఆత్మకు శాంతి చేకూరింది: ఎంపీ బాపురావు - ఎంపీ సోయం బాపురావు వార్తలు
కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలంటూ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంతో డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోరాడరని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు గుర్తు చేసుకున్నారు. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయడంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరినట్లు అయిందని పేర్కొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు.
soyam bapurao
ప్రతి ఒక్కరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివాస్ సందర్భంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు జేబీ.పౌడెల్, స్థానిక నాయకులు డా.కొత్తపల్లి శ్రీనివాస్, రావి శ్రీనివాస్, పలువురు మహిళ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:అమెజాన్లోనూ ఇక మద్యం హోం డెలివరీ!