కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో భాజపా ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ సంకల్ప యాత్రలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు. భాజపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించాలనే సంకల్పంతో ఈ యాత్ర మొదలుపెట్టినట్లు ఎంపీ తెలిపారు. సిర్పూర్ నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులను అభివృద్ధి పనులకు వినియోగించకుండా పక్కదారి పట్టించారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపిస్తామన్నారు. యాత్రలో భాజపా జిల్లా అధ్యక్షుడు జె.బి. పౌడెల్, పలువురు స్థానిక భాజపా నాయకులు పాల్గొన్నారు.
'కాగజ్‌నగర్‌లో గాంధీ సంకల్ప యాత్ర... పాల్గొన్న ఎంపీ' - కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భాజపా ఆధ్వర్యంలో గాంధీ సంకల్ప యాత్ర నిర్వహించారు. ఎంపీ సోయం బాపూరావు పాల్గొన్నారు.
'కాగజ్‌నగర్‌లో గాంధీ సంకల్ప యాత్ర... పాల్గొన్న ఎంపీ'