తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసిఫాబాద్​లో పోటాపోటీగా నామినేషన్లు - congress

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మొదటి రోజు ప్రశాంతంగా ముగిసింది. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు, ఎంపీటీసీ స్థానాలకు ఏడుగురు పత్రాలు సమర్పించారు.

మొదటి రోజు పోటాపోటీగా నామినేషన్లు

By

Published : Apr 27, 2019, 10:53 AM IST

రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు అభ్యర్థులు కుమురం భీం ఆసిఫాబాద్​ నిన్న నామినేషన్​లు పోటాపోటీగా దాఖలు చేశారు. జడ్పీటీసీ స్థానానికి ఇద్దరు, ఎంపీటీసీ స్థానాలకు ఏడుగురు పత్రాలు సమర్పించారు. ప్రధాన పార్టీలైన తెరాస, కాంగ్రెస్​లతో పాటు స్వతంత్రులు కూడా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు.

మొదటి రోజు పోటాపోటీగా నామినేషన్లు
జడ్పీటీసీ స్థానానికి ఉపాధ్యాయురాలిగా చేసిన రాజేంద్ర కుమారి రాథోడ్ కాంగ్రెస్ నాయకుడు రితీష్ నేతృత్వంలో నామ పత్రం సమర్పించారు. నిమ్మల మహేష్ గౌడ్ కూడా కాంగ్రెస్ మద్దతుతోనే జడ్పీటీసీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. రహపల్లి ఎంపీటీసీ స్థానానికి మిట్ట సాయిలత, మారి శెట్టి నుంచి శ్రీధర్, మోవాద్​ స్థానం నుంచి హనుమంతరావు కాంగ్రెస్ తరపున నామపత్రాల సమర్పించారు. తెరాస తరపున గుండి ఎంపీటీసీ స్థానం నుంచి జబారి రాజు, చిర్రకుంటా శంకర్ తెరాస నుంచి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. స్వంతంత్ర అభ్యర్థిగా దుర్గం రాజు నామపత్రాలు సమర్పించారు. రెండో విడుత నామినేషన్లు మొదటి రోజు హోరాహోరిగా జరుగగా... నేడు ఎవరెవరూ దాఖలు చేస్తారనే అనే అంశంపై ఆ ప్రాంత ప్రజల్లో ఆసక్తి పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details