తెలంగాణ

telangana

By

Published : May 22, 2020, 12:04 AM IST

ETV Bharat / state

సరకుల పంపిణీకి వెళ్లిన.. ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు

ఆదివాసీలకు సరకులు సాయం చేయడానికి వెళ్తున్న ఎమ్మెల్యే సీతక్కను పోలీసులు అడ్డుకున్నారు. కర్ఫ్యూ కారణంగా అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని ఇప్పల్​​నవేగం సమీపంలో చోటుచేసుకుంది. గతంలో లాక్​డౌన్​ సమయంలో వాగుల్లో, వంకల్లో, రోడ్డు దారుల్లో అనేక ప్రాంతాల్లో తిరిగి ఆమె నిరుపేదలకు నిత్యావసరాలు అందజేశారు.

MLA seethakka went to deliver the goods asifabad police blocked
సరకుల పంపిణీకి వెళ్లిన.. ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు

కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో ఇప్పల్​నవేగం సమీపంలో కొలంగొంది నిర్వాసితులకు ములుగు ఎమ్మెల్యే సీతక్క సరకులను పంపిణీ చేయడానికి వెళ్లారు. ఆమెను చెక్​పోస్టు దగ్గర పోలీసులు ఆపారు. సాయంత్రం 6 గంటల తరువాత ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిచరదని సీఐ రాజు అన్నారు. "నేను పాకిస్థాన్ నుంచి ఎమైనా వచ్చానా.. నన్ను ఎందుకు అడ్డుకున్నరని" సీతక్క ప్రశ్నించారు. త్వరలోనే పోడు భూముల సమస్యలపై ఆసిఫాబాద్ నుంచే పోరాటం మొదలు పెడతామన్నారు. కొలంగొంది నిర్వాసితుల సమస్యపై హైకోర్టు ఆదేశించి, సంవత్సరమైనా ఎవరూ పట్టించుకోలేదన్నారు.

లారీలు నడుస్తున్నా..

పరామర్శించేందుకు వస్తే... అడ్డుకుంటారా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక లారీలు నడుస్తున్నా పట్టించుకోలేదు కానీ, పేద ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యేను అడ్డుకుంటారా అని మండిపడ్డారు. కనీసం ఒక్క వాహనాన్ని పంపినా సరకులు ఇచ్చివస్తామని చెప్పారు. అయినా పోలీసులు వినకపోవడం వల్ల పంపిణీ కార్యక్రమాన్ని రేపు ఉదయం చేపట్టాలని కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షులు విశ్వప్రసాద్​, కార్యకర్తలకు సూచించి వెళ్లిపోయారు.

సరకుల పంపిణీకి వెళ్లిన.. ఎమ్మెల్యే సీతక్కను అడ్డుకున్న పోలీసులు

ఇదీ చూడండి :రాష్ట్రంలో మరో 38 కరోనా పాజిటివ్‌ కేసులు.. ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details