కాగజ్‌నగర్ పట్టణం.. పాలకవర్గం, అధికారులు కలిసి పనిచేస్తేనే అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన జరిగిన పురపాలిక సంఘం సమావేశంలో పాల్గొన్నారు. పలు తీర్మానాలను ప్రవేశపెట్టగా పాలకవర్గ సభ్యులు ఆమోదించారు.
సీఎం కేసీఆర్, పురపాలక మంత్రి కేటీఆర్‌ను కలిసినప్పుడు పట్టణంలో నెలకొన్న సమస్యలు వివరించానని తెలిపారు. అభివృద్ధికి చేపట్టాల్సిని పనులను తెలియజేశానని పేర్కొన్నారు. దాంతో వారు సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. ఎమ్మెల్యే కొనప్పను ఛైర్మన్ సద్దాం హుస్సేన్, పాలకవర్గ సభ్యులు శాలువతో సన్మానించారు.