ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతు సంక్షేమమే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తోందని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసి ఎమ్మెల్యే పనులు ప్రారంభించారు. రైతు వేదిక నిర్మాణం ద్వారా రైతు సంఘాలు, అధికారులు, శాస్త్రవేత్తలు ఒక వేదిక పైకి రావడం వల్ల రైతులు లాభదాయక పంటలు పండించేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు.
రైతు వేదిక భవనం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ - kumurambheem asifabad district news
రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వంజిరి గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రైతు వేదికలతో రైతులు లాభదాయక పంటలు పండించేందుకు అవకాశం ఉంటుందన్నారు.
రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా లాంటి గొప్ప పథకాలను ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే వెల్లడించారు. తెరాస ప్రభుత్వ పథకాలతో తెలంగాణ రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రామకృష్ణ, మండలాధికారి సుశీల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: ప్రతిపక్షాలవి చౌకబారు విమర్శలు: మంత్రి ఎర్రబెల్లి