కొవిడ్ సోకి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నవారికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నదానం చేస్తున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని పలు ఆసుపత్రుల్లో తిరుగుతూ బాధితులకు.. కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆహార పొట్లాలు అందజేశారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
కరోనా చికిత్స పొందుతున్నవారికి ఎమ్మెల్యే కోనప్ప అన్నదానం - ఆహార పొట్లాల అందజేత
లాక్‌డౌన్ కారణంగా ఆస్పత్రుల్లో ఆకలితో అలమటిస్తోన్న కొవిడ్ బాధితులకు మానవతావాదులు అండగా నిలుస్తున్నారు. కుమురం భీం జిల్లా కాగజ్ నగర్లోని పలువురు కరోనా రోగులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నిత్యం భోజనం అందిస్తూ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. 5 రోజులుగా వారికి అన్నదానం చేస్తున్నారు.
mla koneru konappa
లాక్‌డౌన్ నేపథ్యంలో హోటళ్లు మూసి ఉంచడం వల్ల బాధితులు భోజనం కోసం నానా అవస్థలు పడుతున్నారని ఎమ్మెల్యే వివరించారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతోన్న సుమారు 200 మందికి రెండు పూటలా భోజనాలు అందిస్తున్నామన్నారు. లాక్‌డౌన్ పూర్తయ్యే వరకు కార్యక్రమం కొనసాగిస్తామని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకు వచ్చి ఆకలితో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు.
ఇదీ చదవండి:లాక్‌డౌన్ కారణంగా మళ్లీ సొంతూళ్లకు వలస కార్మికులు పయనం