కుమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో పలు అభివృద్ది పనులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భూమి పూజ చేశారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని పేర్కొన్నారు. కాగజ్నగర్ పరిధిలో తాగునీటి ఎద్దడి తీర్చేందుకు మండలంలోని పెద్దవాగులో మూడు ఇంటెక్ వెల్స్ నిర్మాణాలకు రూపకల్పన చేశారు. ప్రజారోగ్య శాఖ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ పథకంలో 35 కోట్ల నిధులతో మూడు ఊట బావులు, రెండు వాటర్ ట్యాంక్లతో పాటు.. పట్టణంలో పైప్ లైనింగ్ పనులు చేపట్టనున్నారు. ఈ బావుల ద్వారా నీటిని తోడి శుద్ధి పరచి పట్టణంలో తాగునీటిని సరఫరా చేయనున్నారు. ఈ పనులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప శ్రీకారం
కుమురం భీం జిల్లాలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పనులను వేగవంతం చేసి.. ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అభివృద్ధి పనుకు శ్రీకారం
అనంతరం పట్టణంలో కూరగాయల మార్కెట్, సంజీవయ్య కాలనీలోని పనులను ప్రారంభించారు. కూరగాయల మార్కెట్లో 14వ ఆర్థిక సంఘం నిధుల నుంచి మంజూరైన 1 కోటి 6 లక్షల నిధులతో మార్కెట్ భవన సముదాయం నిర్మించనుండగా.. 49 లక్షలతో సంజీవయ్య కాలనీ రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.
ఇదీ చూడండి:ఆక్సిజన్ ట్యాంకు లీకేజీ... 24 మంది మృతి