తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు - MLA koneru konappa government college in sirpur

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప నియోజకవర్గంలోని ప్రభుత్వం జూనియర్ కళాశాల విద్యార్థులకు కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు

By

Published : Nov 4, 2019, 5:58 PM IST

ప్రభుత్వ కళాశాలలో చదువుకునే విద్యార్థుల కోసం కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మధ్యాహ్న భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, ఎస్పీ మల్లారెడ్డి, ఐటీడీఏ పీవో ఆదిత్య, ఎమ్మెల్యే ఆత్రం సక్కు తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని చదువుల్లో రాణించి ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ కోరారు. అనంతరం ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దంపతులు, ప్రజాప్రతినిధులు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

ప్రభుత్వ కళాశాలలో మధ్యాహ్న భోజన కార్యక్రమం ఏర్పాటు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details