కుమురం భీం జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 ఆక్సిజన్ సిలిండర్లను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అందజేశారు. కాగజ్‌నగర్ ఆర్డీవో ఆధ్వర్యంలో అవసరం ఉన్న కొవిడ్ రోగులకు అందజేయాలని సూచించారు. కొవిడ్‌తో పోరాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్నారని.. అటువంటి వారికి ఆక్సిజన్ అందించాలని కోరారు.
15 ఆక్సిజన్ సిలిండర్లను అందజేసిన ఎమ్మెల్యే కోనేరుకోనప్ప - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న వారికి తనవంతు సాయం చేసి ఆదర్శంగా నిలిచారు కుమురం భీం జిల్లా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప. ఒకవైపు కాగజ్‌నగర్‌లో చికిత్స పొందుతున్న కొవిడ్ రోగులకు భోజన సదుపాయం కల్పిస్తూనే.. ప్రాణవాయువుని సైతం అందిస్తున్నారు.
koneru konappa
కొవిడ్ సోకిన వారు ఆత్మస్థైర్యం కోల్పోకుండా సరైన చికిత్స తీసుకుంటే సులభంగా కొలుకోవచ్చని అన్నారు. కొవిడ్ చికిత్స పొందుతున్నవారు ఏ అవసరం వచ్చిన తనను సంప్రదించాలని తెలిపారు.