కుమురంభీం జిల్లా కాగజ్నగర్ పురపాలికలో ప్రవేశపెట్టిన అంచనాల బడ్జెట్ను పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. పురపాలక సంఘం ఛైర్మన్ సద్దాం హుస్సేన్ అధ్యక్షతన 2020- 21వ సంవత్సరానికి గానూ బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, జిల్లా అదనపు పాలనాధికారి డా. రాంబాబు హాజరయ్యారు.
ఈ బడ్జెట్లో ఆదాయం రూ. 34.72 కోట్లు కాగా వ్యయం రూ. 34 కోట్ల 66 లక్షలుగా.. మిగులు రూ. 6.37 లక్షలుగా పేర్కొన్నారు. పలువురు కౌన్సిలర్లు అభివృద్ధి పనుల్లో అంచనాల వ్యయం పెంచాలని కోరగా.. ఎమ్మెల్యే నిధులు కేటాయించి.. అభివృద్ధి పనుల పురోగతిపై తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కోనప్ప హామీ ఇచ్చారు.