ప్రాణహిత కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే - Pranahitha canal repair works in Kumaram bhim district
కుమురం భీం జిల్లా బెజ్జురు, సలుగుపల్లి మండలాల్లో సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పర్యటించారు. ఈ మండలాల్లో నిర్మిస్తున్న ప్రాణహిత కాలువ మరమ్మత్తు పనులను ఆయన సమీక్షించారు. పనులు తర్వగా పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు.
![ప్రాణహిత కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే MLA Koneru Kannappa examined the Pranahitha canal repair works in Kumaram bhim district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7093705-451-7093705-1588831368402.jpg)
ప్రాణహిత కాలువ మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే
కుమురం భీం జిల్లా బెజ్జురు, సలుగుపల్లి మండలాల్లో ప్రాణహిత కాలువ మరమ్మత్తు పనులను సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సమీక్షించారు. రెండు సంవత్సరాల క్రితం కాలువ తెగిపోవటం వల్ల 300 ఎకరాల్లో పంట నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గత నెల సలుగుపల్లిలో పర్యటించిన సందర్భంలో రైతులు సమస్యను తెలియజేయగా.. స్పందించిన ఎమ్మెల్యే మరమ్మతులు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈమేరకు కాలువ మరమ్ముతులు చేపట్టటంతో.. సమీక్షించి పనులు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.