తెలంగాణ

telangana

ETV Bharat / state

'పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి'

పండుగలను అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ దసరా, రంజాన్​, క్రిస్మస్​లకు కానుకలను అందిస్తున్నారని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. క్రిస్మస్​ను పురస్కరించుకొని నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని క్రైస్తవ సోదరులకు బట్టల పంపిణీ చేశారు.

mla koneru Distributed festive gifts to the Christians on behalf of the govt
'పండగను అందరూ సంతోషంగా జరుపుకోవాలి'

By

Published : Dec 21, 2020, 5:15 PM IST

సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని సిర్పూర్​ కాగజ్​నగర్​ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. క్రిస్మస్​ను పురస్కరించుకొని పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కుమురం భీం అదనపు కలెక్టర్ డా. రాంబాబుతో కలసి హాజరయ్యారు. గాంధీనగర్​లోని నజరతే చర్చ్​లో క్రైస్తవ సోదరులకు ప్రభుత్వం తరఫున పండుగ​ కానుకలను పంపిణీ చేశారు.

పండుగలను అన్ని వర్గాల వారు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్​ దసరా, రంజాన్​, క్రిస్మస్​లకు కానుకలను అందిస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని మతాల వారు కలిసికట్టుగా ఉన్నప్పుడే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమానికి పురపాలక ఛైర్మన్ సద్దాం హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:సంక్షేమ పథకాల్లో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శం: మంత్రి మల్లారెడ్డి

ABOUT THE AUTHOR

...view details