ధరణి పోర్టల్లో ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను నమోదు చేసుకోవాలని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆస్తుల నమోదు ప్రక్రియ చేపట్టారని తెలిపారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణం గుంటూరు కాలనీలోని తన నివాసంలో ఎమ్మెల్యే తన ఆస్తులను ధరణి పోర్టల్లో నమోదు చేయించారు. తనతో పాటు ఆయన కుటుంబ సభ్యుల వివరాలనూ అధికారులకు తెలిపారు.
ఆస్తుల వివరాలను ధరణిలో నమోదు చేయించిన ఎమ్మెల్యే కోనప్ప - MLA koneru Konappa latest news
సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తమ ఆస్తులను ధరణి పోర్టల్లో నమోదు చేయించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలనూ అధికారులకు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఆస్తులను నమోదు చేసుకోవాలని సూచించారు.
ఆస్తుల వివరాలను ధరణిలో నమోదు చేయించిన ఎమ్మెల్యే కోనప్ప
ఈ సందర్భంగా ధరణి సర్వేలో ప్రజలందరూ అధికారులకు సహకరించారని ఎమ్మెల్యే కోరారు. సర్వేపై వదంతులు నమ్మొద్దని సూచించారు.
ఇవీ చూడండి: అధైర్య పడొద్దు.. ప్రభుత్వం ఆదుకుంటుంది: మంత్రి కేటీఆర్