కుమురం భీం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీఆర్టీ, టెట్ శిక్షణ కేంద్రంలోని అభ్యర్థులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్టడీ మెటీరియల్ అందజేశారు. కాగజ్నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి కలెక్టర్ రాహుల్ రాజ్, కాగజ్ నగర్ ఎస్డీపీఓ డా.బాలస్వామి హాజరయ్యారు.
అభ్యర్థులకు మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే
సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టీఆర్టీ, టెట్ శిక్షణ కేంద్రంలోని అభ్యర్థులకు ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, కాగజ్ నగర్ ఎస్డీపీఓ డా.బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా మూడోసారి అవకాశం కల్పించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వారి పిల్లలకు విద్యను అందించాలనే కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు కోనప్ప వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభ్యర్థులు ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చక్కటి వాతావరణంలో సకల సదుపాయాలతో శిక్షణ దొరకడం చాలా అరుదైన విషయం అని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. అభ్యర్థులు అందరూ సదవకాశాన్ని వినియోగించుకుని ఉద్యోగ సాధనకు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు కోనేరు కృష్ణ రావు, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి :దాతృత్వం: బ్రెయిన్ ట్యూమర్ వ్యాధిగ్రస్తునికి ఆర్థిక సహాయం